అంతేకాదు ఎన్నో కుటుంబాలు దుర్భర స్థితిని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఎంతో మంది కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇక ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కరోనా వైరస్ కారణంగా అటు పిల్లలకు కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నది వెల్లడైంది. ముఖ్యంగా వైరస్ కాలంలో పిల్లల్లో స్థూలకాయం ముప్పు ఎక్కువ అవుతుంది అన్నది ఇటీవల నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి.. ఇక బయటికి వెళ్ళాలి అంటే భయపడటంతో అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.
ఈ క్రమం లోనే ఫోన్లు కంప్యూటర్లు లాంటివి ఎక్కువగా వాడుతూ ఒకే దగ్గర కూర్చోవడం లాంటివి చేస్తున్నారు.. కరోనా వైరస్ ప్రభావం దృశ్య ఇక బయటకు వెళితే ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందో అని కనీసం ఆడుకోవటానికి కూడా బయటకు వెళ్లడం లేదు. వెరసి రోజు రోజుకు పిల్లల్లో స్థూలకాయం ముప్పు పెరిగిపోతుంది అన్నది అర్థం అవుతుంది. అయితే ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం ఎక్కువగా జంక్ ఫుడ్ కి అలవాటు పడడంతో ఇంకా ఎంతో మంది పిల్లల్లో ఒబిసిటీకి పెరుగుతుంది అన్నది ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో తేలింది అని నిపుణులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి