ఈ ఫ్యాన్ గంటలకు 130 క్యూబిక్ మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. దీనిపేరు 'స్టెల్త్ ప్యూరో ఎయిర్'. ఆరోగ్య వంతమైన జీవన విధానాన్ని కోరుకునే వారిని ఉద్దేశించి ఈ ఫ్యాన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. అన్ని ఫ్యాన్‌లలా ఇది గాలిని నలువైపులకు పంపించడమే కాకుండా అదే సమయంలో శుద్ధి చేస్తుంది. ఇందులో హెచ్‌ఈపీఏ ఫిల్టర్‌ను కూడా అమర్చారు. దాంతో ఈ ఫ్యాన్ గాలిని శుద్ది చేసి ఇస్తుంది. ఈ ఫ్యాన్ కార్బన్ ను యాక్టివేట్ చేస్తుంది. ప్రీఫిల్టర్ విష పదార్థాలను గ్రహించి స్వచ్చమైన గాలిని విడుదల చేస్తుంది. ఇలా ఫ్యాన్ గాలిని ముందుగా శుద్ది చేసి అందిస్తుంది.
అంతేకాదు ఈ ఫ్యాన్ లో మరికొన్ని ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, కిందివైపు లైటు, ఎల్‌ఈడీ ఎయిర్ ప్యూరిఫైర్ ఇండికేటర్ మొదలైనవి ఉన్నాయి. అలాగే, ఈ ఫ్యాన్‌లో ఎరోడైనమిక్ బ్లేడ్స్‌ను ఉపయోగిండంతో ఎలాంటి శబ్దం లేకుండా గాలిని విడుదల చేసింది. ఇకపోతే కంపెనీ 'హావెల్స్ ఫ్యాన్‌మేట్' ఫ్యాన్‌ను కూడా ఆవిష్కరించింది. ఇందులోనూ కార్బన్ ఫిల్టర్లు ఉన్నాయి. దీనికితోడు గాలిని మనకు ఇష్టమైన దశలో మరల్చుకునే సదుపాయం కూడా ఉండటం అద్భుతమని చెప్పాలి.మూడు గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంది. యూఎస్‌బీ కేబుల్ ద్వారా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు.. ఈ కేబుల్ తో ల్యాప్ టాప్ కు కనెక్ట్ చేసుకొని ఫ్యాన్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి