అయితే రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోవడం లేదా ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. కానీ తాగి చనిపోయిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు అనే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇలాంటి సందర్భాల్లో పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం కూడా సమర్థించడం గమనార్హం.
అయితే సుప్రీం కోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ సిమ్లా లోని చౌపాల్ పంచాయతీలో అటవీ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997 లో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు వారి కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.అయితే పరీక్ష నిర్వహించగా ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలూ లేవు.అతిగా మద్యం తాగడం వళ్లే చనిపోయాడు అన్నది తేలింది. అయితే ఇలా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తేలితే ప్రమాదం కానందున పరిహారం చెల్లించబోము కంపెనీ చెప్పడంతో వినియోగదారుల ఫోరంకు ఫిర్యాదు చేయగా వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ఇక పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ సంస్థకు లేదు అని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి