ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అంశం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తానంటూ అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో..  ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటన ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎంతో మంది ప్రజలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుని తీరుతామని నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకీ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.



 అధికార ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ క్రమంలోనే ఎంతోమంది రాజకీయ నేతలు ప్రజలకు మద్దతు పలుకుతూ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఉద్యమం కూడా చేపడుతున్నారు. ఇలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో టిడిపి లో కీలక నేత అయిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.



 ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఏపీ రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కేవలం రాజీనామా చేయడమే కాదు ఆయన రాజీనామా పత్రాన్ని ఏపీ స్పీకర్ కు కూడా అందజేశారు. ఇటీవల టిడిపి నేత గంటా శ్రీనివాసరావు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో కలిసి సమావేశం కావడం  హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ సమావేశం అనంతరం తనకు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని గంటా శ్రీనివాసరావు ఇచ్చారని ఇక త్వరలోనే ఈ రాజీనామా ఆమోదించపోతున్నాను అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: