ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు బెడదా రోజు రోజుకు ఎక్కువ వుతోంది. ఈ క్రమం లోనే ఇక స్మార్ట్ఫోన్ తెరిచి సోషల్ మీడియా ఓపెన్ చేయాలి అంటే భయపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏ క్షణం లో సైబర్ నేరగాళ్ల దాడి చేసి వివిధ రకాల సమాచారాలను తెలుసుకుని ఇక ఆ తర్వాత ఖాతాలను ఖాళీ చేస్తారో అని ప్రస్తుతం అందరూ భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడెందుకు సిద్ధమవుతున్నారు.



 సాధారణం గా అయితే మొబైల్ లో అప్పుడప్పుడు అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటుంది ఇక అలా అప్డేట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మొబైల్ ఎంతో వేగం గా పని చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలం లో మాత్రం ఇక ప్రతి ఒక్కరు కూడా తమ మొబైల్ అప్డేట్ చేసుకోవడానికి భయ పడుతున్నారు.  ఎందుకంటే మొబైల్ లో వస్తున్న అప్డేషన్ సాఫ్ట్వేర్ లాగానే ఎన్నో రకాల మాల్వేర్ లను పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు ఇక అప్డేషన్ పేరుతో ఏకంగా మొబైల్లో ఉన్న కీలక సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.



 ఇక ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లు లో అయితే ఇలాంటి భయం ఎక్కువగా అయిపోయింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై కొత్త మాల్వేర్ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవలే సెక్యూరిటీ నిపుణులు తెలిపారు  సిస్టమ్ అప్డేట్ చేస్తాను అంటూ మాయ మాటలతో నమ్మించి చివరికి మొబైల్ హ్యాక్ చేసే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరించారు నిపుణులు. థర్డ్ పార్టీ యాప్ లను  అసలు నమ్మొద్ధు అంటూ సూచించారు. పూర్తిగా మొబైల్ ఫోన్ ను తమ ఆధీనంలోకి తెచ్చుకొని అందులోని అన్ని రకాల సమాచారాన్ని సేకరించే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: