ముఖ్యంగా భారత్ పై చైనా ఎప్పుడు ఏదో ఒక విధంగా ఏడుస్తూనే ఉంటుంది. భారత ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయిన చైనా ఇక భారత ఎదుగుదలపై ఏదో ఒక విధంగా ప్రపంచ దేశాలకు చెడుగా చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో భారత డిజిటల్ మీడియ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. పూర్తిగా భారత దృక్పథంతో వార్తలను ప్రచురిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో వియాన్ అనే డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.
పూర్తిగా ఇండియా దృక్పథంతోనే వార్తలను ప్రెజెంట్ చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది ఈ డిజిటల్ మీడియా. అయితే ఇండియా మీడియాపై చైనా కు కడుపు మంట వచ్చి ఏకంగా ఈ డిజిటల్ మీడియా కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియా తైవాన్ వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తుందని... తైవాన్ చైనా లో భాగమే అంటూ చైనా చెబుతోంది. తైవాన్ ను భారత మీడియా ప్రత్యేకంగా గుర్తించడానికి వీలు లేదు అంటూ చైనా నోటీసు ఇచ్చింది. ఇక భారత డిజిటల్ మీడియా వ్యవహారం చూస్తూ ఉంటే తైవాన్ కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని.. ఇది పూర్తిగా జర్నలిస్టిక్ ఎథిక్స్ కి విరుద్ధంగా ఉంది అంటూ ఒక నోటీసు ఇచ్చింది చైనా. ప్రజాస్వామ్యానికి అసలు విలువ ఇవ్వని చైనా ఇలాంటి మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి