సంస్కృతం ప్రొఫెసర్ గౌరీ ధర్మపాల్ అభ్యుదయ భావాలు కలిగిన మహిళ. రూమ, నేను ఆవిడ విద్యార్థులం. వేదపారాయణం, శ్లోకాల పఠనం, క్రతువులు మొదలైనవెన్నో ఆవిడ మాకు నేర్పించేవారు. అయితే పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా ఆవిడను చాలా ఏళ్ల తర్వాత కలిశాం. ఆ సమయంలో ఆవిడ మాకు భారతీయ బెంగాలీ వివాహ తంతును సులువైన తీరులో ఎలా జరిపించవచ్చో నేర్పించారు. అప్పటికి కొద్ది రోజుల్లో నా కూతురు వివాహం ఉంది. ఆ పెళ్లికి నేనే పౌరోహిత్యం చేయాలనే ఆలోచన ఉండడంతో పెళ్లి తంతు మొత్తం ఆసక్తిగా నేర్చుకున్నాను. అలా పురోహితురాలిగా మొట్టమొదటి పెళ్లి జరిపించాను.
నాతో పాటు నా ముగ్గురు స్నేహితురాళ్లు కలిశారు. అలా పెళ్లి తంతుతో పాటు, పరలౌకిక పూజ, అన్నప్రాసన, గృహప్రవేశం... ఇలా మా శుభమస్తు సంస్థ ద్వారా 2009 నుంచి నాలుగు రకాల వేడుకలను మహిళలు పూజారులుగా పనికిరారు అంటారు. నెలసరిలో ఐదు రోజులు మహిళలు అపవిత్రులుగా పరిగణించబడుతూ ఉంటారు. అలాగే నెలసరి వయసులో ఉన్న మహిళలు పూజలు ఆచరించడానికీ, నిర్వహించడానికీ, ఎటువంటి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికీ వీలుండదు. ఈ ఆచారాలన్నిటికీ 21వ శతాబ్దంలో స్థానం లేదు. నెలసరి అనేది ప్రకృతిసహజంగా మహిళల శరీరాల్లో జరిగే ఓ జీవక్రియ.
నిజానికి మాతృత్వం దక్కేది దాన్నుంచే కాబట్టి, ప్రతి మహిళా నెలసరిని సెలబ్రేట్ చేసుకోవాలి. మాతృత్వ గుణాలు మహిళల ఔన్నత్యాన్ని పెంచుతాయి. అలాంటప్పుడు మహిళలు అపవిత్రులు ఎలా అవుతారు? పవిత్రతను అలా లెక్కించడం సరి కాదు. అబద్ధం చెప్పడం, దెబ్బలాడడం లాంటి గుణాలు మనిషిని అపవిత్రపరుస్తాయి.. ఆ తర్వాత నుంచి నేను యదావిధిగా శుభకార్యాలను జరిపించామని ఆమె అన్నారు. అందరికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా , రెండు చేతులా డబ్బులను సంపాదిస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి