తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే అటు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు  సామాన్య ప్రజలు. గత ఏడాది ఇదే సమయంలో ఎలాంటి దుర్భర స్థితిని అయితే అనుభవించారో ప్రస్తుతం మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు వలస కూలీల అయితే బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ లాక్ డౌన్ విధిస్తారో ఎక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చిన  కరోనా వైరస్ కేసుల సంఖ్య మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది.



 గత ఏడాది లాక్ డౌన్ పరిస్థితులే మళ్ళీ వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక గత ఏడాదిలా కాకుండా ముందుగానే అప్రమత్తం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలి అని ఆంక్షలు తెరమీదికి తీసుకురావడమే కాదు  నిబంధనలను ఉల్లంఘించిన వారికి  జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే  కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా   అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటుంది.  ఇక ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో మున్సిపల్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.



 రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న దృశ్య ఇక ప్రతి ఒక్కరు కూడా విధులకు హాజరయ్యేలా చూడాలి అంటూ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు పట్టణాల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడమే కాదు ప్రజలకు కరోనా వైరస్ పై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అయితే గత ఏడాది కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో... అటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులు అందరిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కీలక నిర్ణయం తీసుకొని సెలవులు రద్దు చేసింది అన్న విషయం తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: