హనుమంతుడు అంజనాద్రి లోనే జన్మించాడు అని చెప్పేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీలోని పండితులు అందరూ కూడా ఎంతో బలమైన ఆధారాలను సేకరించడంలో ఎంతగానో శ్రమించారు. నాలుగు నెలలపాటు హనుమంతుడి జన్మ స్థానం పై కమిటీ అన్వేషణ జరుగుతోంది. ఇటీవలే హనుమంతుడి జన్మస్థానం అంజనాద్రి అనటానికి ఎన్నో ఆధారాలు దొరికాయి అందుకే అధికారిక ప్రకటన చేశారు. శాసన భౌగోళిక పౌరాణిక వాగ్నేయ ప్రమాణాలతో ఎన్నో ఆధారాలు సేకరించామని అయితే వేంకటాచలానికి అంజనాద్రి తో పాటు మరో 20 పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పారు త్రేతాయుగం లో ఈ ప్రాంతం ని అంజనాద్రి గా పిలిచారు అంటూ కమిటీ పండితులు చెప్పారు.
అంతేకాదు ప్రస్తుతం పురాణాల్లో కూడా హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రి లోనే జన్మించినట్లుగా చెబుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. తిరుమలలోని జపాలి తీర్థం ఆంజనేయుడు జన్మస్థలంగా అధికారికంగా అందుకే ప్రకటిస్తున్నాము అంటూ తెలిపారు హంపి విజయనగరం లో ఉన్నది అంజనాద్రి కాదని అంతేకాకుండా జార్ఖాండ్ నాసిక్ గుజరాత్ మహారాష్ట్ర లో ఉన్నవి కూడా అంజనాద్రి కావు అంటూ చెబుతున్నారు.12, 13వ శతాబ్దం నాటి నుంచి ఎన్నో రచనలు అంజనాద్రి ప్రస్తావన వచ్చిందని.. అన్నమయ్య కీర్తనల్లో కూడా వెంకటాచలం అంజనాద్రి గా వర్ణించారు పండితులు చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి