నేడు ప్రపంచ భూమి దినోత్సవం... ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే ఈ భూమిపై రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. అంటే భూమి ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. శీతోష్ణస్థితి మార్పులో ఇది ముఖ్యమైన విషయం. ఇది సైంటిఫిక్ గా రుజువైంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది మానవాళి చేసే చర్యల వలనే పెరుగుతోందని ఇప్పటికే నిరూపితమైనది. కాబట్టి ఈ ప్రపంచం లో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుడు ఇందుకు బాధ్యుడిగా చూపబడుతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారమే అతిపెద్ద మానవ ప్రభావం. కార్బన్ డయాక్సైడ్ గాలిలో ఎక్కువగా వెలువడడం, అడవుల కాల్చివేత మరియు అడవులు క్షీణించడం, కొన్ని కృత్రిమ వ్యవసాయ పద్ధతులు ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ కు ప్రధాన కారణాలు.

అదే విధంగా ఇవన్నీ మానవ చర్యలే. మానవుని యొక్క కార్యకలాపాల వలన వాతావరణం ఈ విధంగా ప్రభావితమవుతుంది. భూమిపై ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో పెరుగుతుంది, వాతావరణ సమస్యలకు ప్రేరేపిస్తుంది, కరువు కాలాలకు కారణమవుతుంది, మహాసముద్రాలు సగటు పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ 2 సి మించి ఉంటే, అది వాతావరణ అస్థిరతను సృష్టిస్తుంది. ఎడారి భూముల పెంపుకు కారణమవుతుంది. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం 2100 నాటికి భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి ప్రజా జీవనానికి సవాలుగా మారనుందని చెప్పింది. ఇలా జరగకుండా ఉండాలంటే.... దేశ పౌరులు చేయాల్సిన ప్రధానాంశాలు.

వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. తక్కువ దూరాలకు నడిచి వెళ్లే పద్ధతిని మొదలుపెట్టాలి. మనిషికో కారు లేదా మోటార్ వాహనం వినియోగించకుండా... ప్రజా రవాణాను వినియోగించాలి. విద్యుత్ ను ఆదా చేయాలి, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి. అడవుల విస్తీర్ణం పెంచాలి, ఇలా మానవుని లో వచ్చే మార్పు వలన ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ ఆధారపడి ఉంటుంది. రాబోయే కాలంలో మన జీవితం మనము చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. మానవుడు ప్రకృతికి నష్టం కలిగించే ప్రతి ఒక్క పనిని మానెయ్యాలి. ప్రకృతిని మన అమ్మలాగా చూసుకోవాలి. ప్రకీర్తి బాగుంటేనే మనము బాగుంటాము. ప్రకృతి కన్నెర్ర చేస్తే..ప్రపంచమే అంతమయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: