చైనా నుంచి భారత్ కి పాకి పోయిన మహమ్మారి కరోనా వైరస్ చైనా ను వదిలిపెట్టింది కానీ  భారత్ ను మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు. మొన్నటివరకు భారత్లో అతి తక్కువ కేసులు ఉండగా మరోసారి ఇండియాలో కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.  అయితే గతంలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.  ఇక లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది అంతే కాకుండా మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి అయితే ప్రస్తుతం శరవేగంగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు వచ్చినప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం లేదు.



 అయితే గత ఏడాది కరోనా వైరస్ లాక్ డౌన్ అమలులోకి వచ్చిన సమయంలో ఎన్నో చిత్రవిచిత్ర ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏకంగా కొంతమంది  హారతులు ఇచ్చి కరోనా వెళ్లిపోవాలి అంటూ వేడుకోవడం అంతేకాకుండా మరికొంతమంది గో కరోనా గో అంటూ స్లోగన్ చెప్పడం చేశారు. ముఖ్యంగా గత ఏడాది గో కరోనా గో అనే స్లోగన్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఇక్కడ గో కరోనా గో  కాకుండా బాగ్ కరోనా బాగ్ అనే స్లోగన్ తెరమీదికి వచ్చింది.  ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా  వైరస్ ని తరిమి కొట్టేందుకు ఒక వినూత్న ఆలోచన చేశారు. గ్రామస్తులందరూ చేతిలో కాగాడాలు పట్టుకొని ఊరి చివరి వరకు కరోనా వైరస్ ని తరిమి కొట్టారు.



 ఏంటి నమ్మడం లేదు కదా కానీ ఇది నిజంగా నిజమే.. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మధ్యప్రదేశ్ లో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది మాల్వా జిల్లాలోని గణేష్ పుర గ్రామస్తులు బాగ్ కరోనా బాగ్ అంటున్నారు  . వైరస్ను ఊరు నుంచి తరిమి కొట్టేందుకు గ్రామస్తులు అందరూ కూడా చేతిలో కాగడాలు పట్టుకొని ఊరి చివరి వరకు పరుగులు పెట్టారు. పురాతన కాలం నుంచి ఊర్లో ఏదైనా వింత వ్యాధి వచ్చిన సమయంలో అందరూ ఇలా ఆ వ్యాధి నుంచి బయట పడేందుకు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: