కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రస్తుతం భారత్లో విలయతాండవం చేస్తుంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక కరోనా వైరస్ పేరెత్తితే చాలు జనాలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు ఇలాంటి సమయంలో కొంతమంది మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందితే ఏంటీ అంటూ తమ పని తాము చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా పెళ్లిళ్లు పై తీవ్ర ప్రభావం పడింది.  ఒకప్పుడైతే బంధుమిత్రులందరికీ సమక్షంలో ఘనంగా పెళ్ళి చేసుకొని అందరి ఆశీర్వచనాలు పొందాలని అనుకునేవారు నూతన వధూవరులు.  ఇప్పుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.



 ఎక్కడ ఎవరికి కోవిడ్ ఉంటుందో అని భయపడి పోతున్నారు చివరికి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే కరోనా వైరస్ బారిన పడాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు అందుకే ఎక్కువ మంది జనాలు  లేకుండానే కొంత మంది సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రభుత్వం కూడా రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి నిబంధనలు అమలులోకి తెస్తోంది.  దీంతో కొంత మందికి బంధుమిత్రులందరికీ సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ అది మాత్రం కుదరడం లేదు.  అయితే కరోనా వైరస్ విజృంభిస్తుడటం వల్ల ఎంతో మంది పెళ్లిళ్ల ను  వాయిదా వేసుకుంటే కొద్దిమంది మాత్రం మొండి పట్టు పట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకాడటం లేదు.



 ఇక్కడ జంట మాత్రం మరి మొండికేసినట్లు అనిపిస్తుంది ఎందుకంటే వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కానీ అంతలో కరోనా వైరస్ పెరిగిపోయింది. అంతేకాదు వధూవరులిద్దరూ కూడా వైరస్ బారిన పడ్డారు.  ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు వైరస్ నుంచి కోలుకున్నాక పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం పెళ్లి జరగాల్సిందే అంటూ మొండి పట్టు పట్టారు. ఇక అధికారులకు రిక్వెస్ట్ కూడా చేశారు. ఇంకేముంది చేసేదేమీ లేక వైద్య అధికారులు వీరికి పీపీఈ కిట్స్ అందించారు..  పీపీఈ కిట్ ధరించిన వీరిద్దరూ ఇక కిట్ పైనుంచి దండలు మార్చుకున్నారు ఆ తర్వాత హోమం చుట్టూ తిరిగి పెళ్లి చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: