ఇక ఇప్పుడు కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంతకుమించి అనే రేంజిలో విజృంభిస్తుంది. రోజురోజుకు దేశంలో విపత్కర పరిస్థితులను తీసుకు వస్తున్న నేపథ్యంలో మరింత దారుణంగా మారిపోతున్నాయి పరిస్థితిలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చూస్తూ ఉంటే దేశంలో ఎప్పుడూ లక్ డౌన్ అమలులోకి వస్తుందో కూడా చెప్పలేని విధంగా మారిపోయింది పరిస్థితి. ఇలా రోజురోజుకు ఎంతో దారుణ పరిస్థితులు వెలుగులోకి వస్తుండగా ఇక వలస కార్మికులు అందరూ ఇప్పటికే ఇంటి బాట పట్టారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్లు బస్టాండ్లు అన్నీ స్వగ్రామాలకు బయలుదేరిన వలస కార్మికులతో రద్దీ కనిపిస్తున్నాయి.
మరి కొన్ని రోజులపాటు ఇలా వలస వచ్చిన చోట ఉంటే ఇక చివరికి లాక్ డౌన్ పరిస్థితులు వచ్చి తినడానికి తిండి కూడా దొరకని దుస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వలస కార్మికులు భావిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తి ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం రోజుకు దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శరవేగంగా పారిపోతున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రజలందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ఇక ఏకంగా లక్ డౌన్ విధిస్తూ నిర్ణయం కూడా తీసుకుంటూ ఉన్నాయి ప్రభుత్వాలు అన్న విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి