ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ తప్పదు అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయిన నేపథ్యంలో అటు కఠిన ఆంక్షలను కూడా అమలులోకి తెస్తోంది ప్రభుత్వం.



 అయితే కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని రకాల చర్యలను అమలు లోకి తీసుకు వస్తుంది కానీ అటు పదవ తరగతి ఇంటర్మీడియెట్ పరీక్షల విషయంలో మాత్రం మొండి వైఖరిని అవలంభిస్తోంది జగన్ సర్కార్. పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి అని అందుకే ఎట్టి పరిస్థితుల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించి తీరుతాము అంటూ జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు.



 ఇక అటు ప్రతిపక్ష పార్టీలు సైతం జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల పరీక్షల నిర్వహణ వ్యవహారం కాస్త హై కోర్టు మెట్లెక్కింది. ఈ నెల 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఒక నివేదిక సమర్పించాలని అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  కాగా పరీక్షల విషయంలో మొండి వైఖరితో ఉన్న జగన్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని అంటూ నివేదిక సమర్పిస్తే ఇక పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఇక పాలనలో జోక్యం చేసుకుంటుందా అన్నది కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: