కాగా ఇంతటి భయాందోళనల సమయంలో ఈ రోజు ఒక ఊరటనిచ్చే విషయం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలో 3 లక్షల మంది కరోనా సోకిన రోగులు రికవరీ అయ్యారు. ఇది ప్రస్తుతానికి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించే విషయం. ఒక్క రోజులో ఇంత మంది రికవరీ కావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఇది మన దేశంలోనే ఇప్పటి వరకు రికార్డుగా నిలిచింది. దీనితో కరోనా రోగుల రికవరీ శాతం 99 శాతానికి చేరింది. మెల్ల మెల్లగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా...ఏ వైరస్ మనల్ని చుట్టుముట్టినా మన మనోధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ముందు నిలబడకుండా చేయాలి. ఒక్కసారి దానికి భయపడ్డామా మనల్ని చిదిమేస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిది ఇప్పుడు ఒకే ఒక బాధ్యత....వైరస్ ని మనకు రాకుండా చూసుకుందాం....మన నుండి వేరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుందాం. ప్రభుత్వం కూడా వైద్య ఆరోగ్య వసతులన్నిటినీ ప్రతి ఒక్క హాస్పిటల్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. కరోనా రోగులు ఎక్కువ శాతంలో కోలుకుంటున్నారని విషయాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ చెప్పండి. కరోనా వైరస్ గురించి దిగులు చెందకండి. కనీస జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ ను పారదోలండి. మీరు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి. ఒకవేళ వెళ్లినా తప్పనిసరిగా శానిటైజర్ అప్లై చేసుకోండి మరియు మాస్కును ధరించండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులతో కరచాలనం చేయకండి. భౌతికదూరాన్ని పాటించండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి