ముఖ్యంగా ఇలా మొదటగా ఇజ్రాయిల్ దేశం ప్రకటన చేసింది అన్న విషయం తెలిసిందే. తమ దేశంలో పూర్తిగా వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసింది ఇజ్రాయిల్. ఇక ఆ తర్వాత దేశ ప్రజలందరికీ మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి కాదు చెప్పేసింది. కేవలం గ్రూపులు గా ఉన్నవాళ్లు మాత్రమే మాస్క్ ధరించాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. ఇక ఆ తర్వాత అమెరికా కూడా ఇదే నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాసం ధరించడం తప్పనిసరి కాదు అంటూ ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఇటీవలే మరో దేశం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఇజ్రాయెల్ అమెరికా లాంటి దేశాలు మాత్రం తప్పనిసరి కాదు అంటూ నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం ఫ్రాన్స్ కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలందరూ మాస్క్ ధరించడం తప్పనిసరి కాదు అంటూ స్పష్టం చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. కేవలం గ్రూపులు గా ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ పెట్టుకోవాలి అంటూ తెలిపింది. ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా కరోనా వైరస్ ప్రభావం నుంచి బయట పడుతున్నాయి. టీకా ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతుంది కానీ భారత్లో మాత్రం మునుపెన్నడూ లేని విధంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి