దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తూ వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతోంది. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. ఈ క్రమంలోనే దేశంలో రోజురోజుకు కరోనా వయసు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో కరోనా నీడలు కమ్ముకుంటున్నాయి.  ఈ క్రమంలోనే ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ రెండవ దశ  మొదటి రకం వైరస్ తో పోలిస్తే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు.



 ప్రస్తుతం కరోనా వైరస్ పై ప్రజలలో పూర్తి స్థాయి అవగాహన వచ్చిన నేపథ్యంలో అందరూ మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు. అయితే కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా  వైరస్ నియంత్రణ కోసం తగిన చర్యలు చేపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు దేశంలో  వైరస్ ఉందా లేదా అన్నది అనుమానంగా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇటీవలే గుజరాత్ లో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ ప్రమాదకర రీతిలో విజృంభిస్తున్నప్పటికీ కొందరు మాత్రం పట్టించుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుజరాత్ సానంద్ తాలూకాలు వేలాది మంది భక్తులు ర్యాలీగా వెళ్లడం ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది.  ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బలియా దేవి ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు తలపై బిందెలు పట్టుకొని వేలాది మంది మహిళలు తరలి వెళ్లారు వీరి మధ్య భౌతికంగా దూరం కానీ మాస్క్ లు పెట్టుకోవడం లాంటి జాగ్రత్తలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దేవతల ఆగ్రహం కారణంగానే  వైరస్ వచ్చిందని.. కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు తాము ఇలా దేవతలకు ప్రార్థనలు చేస్తున్నాము అంటూ స్థానిక ప్రజలు చెబుతున్నారు.https://youtu.be/2Ewbk7tUtVU

మరింత సమాచారం తెలుసుకోండి: