దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది  ప్రస్తుతం మొదటి రకం కరోనా వైరస్ తో పోలిస్తే రెండవరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది  భారత్లో ప్రస్తుతం కేవలం ఒక దేశానికి చెందిన వైరస్ మాత్రమే కాకుండా వివిధ దేశాలకు చెందిన వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్, యూకే, భారత్ రకాల వైరస్ లు ఉన్నాయి అంటూ పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ నాలుగు దేశాలకు సంబంధించిన వైరస్ లు ప్రస్తుతం దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందటంతో ఎంతోమంది బెంబేలెత్తిపోతున్నారు.  ఈ క్రమంలోనే ఇక వివిధ దేశాలకు చెందిన వైరస్లు అటు మనుషులపై భిన్నంగా ప్రభావం చూపుతుండడంతో ఎంతో మందిలో లక్షణాలు కూడా ఎంతో భిన్నంగానే ఉన్నాయి అని చెప్పాలి.



 భారతదేశంలో  వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందింది అంటూ వార్తలు రావడంతో అందరూ బెంబేలెత్తిపోయారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే దానిపై కేంద్రం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దేశంలో కొత్తగా గుర్తించిన టువంటి బి61 వేరియంట్ తప్ప ప్రస్తుతం దేశంలో ఎలాంటి కొత్త వైరస్ రకాలు లేవు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శి వేణు స్వరూప్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు



 ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి n40ke  రకం వైరస్ పూర్తిస్థాయి పరిశోధన పత్రాలు ఇంకా ప్రచురితం కాలేదు అంటూ తెలిపారు ఆయన. తాము వైరస్ జన్యు పరిణామక్రమాన్ని విశ్లేషించిన సమయంలో ఈ రకం వైరస్ బయటపడినప్పటికీ ఎంతో వేగంగా ఇది అంతర్దాణం  కూడా అయిపోయినట్లు అని తెలిపారు. ప్రస్తుతం b61 వైరస్ రకమే వ్యాప్తి పరంగా ప్రభావం పరంగా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు ఆయన. దేశంలో కొత్త వైరస్ వచ్చింది అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: