నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన సంఘటనలు విషయాలు కూడా క్షణాల్లో వ్యవధిలోనే తెలిసిపోతున్నాయి.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా తమ సమీపంలో ఉన్న విషయాల గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియా కారణంగా ప్రపంచములోని ఎక్కడో మారుమూల జరిగిన విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదిక లోకి ఎక్కిన ఎన్నో విషయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి విషయాలు తెలుసుకున్నాక ఇది నిజమేనా కాదా అని అనుమానం రాక మానదు ఇక్కడ ఒక విషయం గురించి అందరూ ఇలాగే  ఆశ్చర్యంతో అనుమాన పడుతున్నారూ.


 సాధారణంగా మద్యం ఫుల్ బాటిల్ ధర ఎంత ఉంటుంది.. వేలల్లో ఉంటుంది మహా అయితే లక్షల్లో ఉంటుంది...  అంతేకానీ కోట్ల రూపాయల విలువ చేసే ఫుల్ బాటిల్ ని ఎప్పుడైనా చూసారా..  ఫుల్ బాటిల్ ధర కోట్లలో ఉండడం ఏంటి జోక్స్ వేస్తున్నారు కదా అని అంటారు ఈ విషయం చెబితే ఎవరైనా.. కానీ అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇది అక్షర సత్యం కాబట్టి. ఇక్కడ ఫుల్ బాటిల్ ధర ఏకంగా కోట్లలోనే ఉంది. ఇంతకీ ఆ ఫుల్ బాటిల్ ధర ఎంత అనుకుంటున్నారా  ఏకంగా 7.4 కోట్ల రూపాయలు.



 ఏంటి అవాక్కయ్యారు కదా.. కానీ ఇది నిజమే నండోయ్.  ఒక ఫుల్ బాటిల్ ధరను అక్షరాలా 7.4 కోట్లుగా నిర్ణయించింది ఓ సంస్థ.. ఈ ఫుల్ బాటిల్ కి అంత ధర ఉండడానికి కారణం ఏంటి అని అనుకుంటారు కదా. దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. పెట్రాస్ 2000 అనే ఫ్రెంచ్ వైన్ ను అంతరిక్షంలో పులియా బెట్టారు. అందుకే ఈ ఫుల్ బాటిల్ కు అంత ధర నిర్దేశించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడాదికి పైగా ఉంచిన ఈ వైన్ బాటిల్ ను క్రీస్టీస్ అనే సంస్థ వేలానికి పెట్టింది. ఇంకా 20, 30 సంవత్సరాల వరకు ఈ వైరల్ గా మారుతుంది అంటూ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: