

సరిపల్లి కోటిరెడ్డి, శ్రీజా రెడ్డి దంపతులు ఈ పినాకిల్ బ్లూమ్స్ సంస్థను 2017లో స్థాపించారు. ఫలితంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు ఈ సంస్థ వరంలా మారింది. మానసికంగా ఎదుగుదలలేని పిల్లల కోసం పనిచేస్తూనే.. సేవా ఫౌండేషన్ ద్వారా ఉచితంగా థెరఫీలు అందిస్తున్నారు శ్రీజారెడ్డి. కోటిరెడ్డి- శ్రీజారెడ్డి దంపతుల కుమారుడు తొలినాళ్లలో ఆటిజంతో బాధపడుతుండటంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. ఈ క్రమంలో వారు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీకావు. తాము పడిన ఇబ్బందులు మరే తల్లిదండ్రులు పడకూడదు అనే అభిప్రాయానికి వచ్చినవారు పినాకిల్ బ్లూమ్స్ సంస్థను ప్రారంభించారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో బ్రాంచ్‌ల ద్వారా అన్నీ రకాల వైద్యం ఒకేచోట అందిస్తూ ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు పునఃర్జన్మను ప్రసాదిస్తున్నారు.

పినాకిల్స్ బ్లూమ్స్ స్థాపించిన కొత్తలో శ్రీజారెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్పొరేట్ సిస్టం నుంచి ఎదురైన సవాళ్లను ఒక్కొక్కటిగా అదిగమించుకుంటూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ పినాకిల్స్ బ్లూమ్స్ ద్వారా 1500 ఆటిజం చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా బలంగాలేని తల్లిదండ్రులకు 33శాతం రాయితీ ఇస్తూ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల వారిలోనే ఎక్కువగా ఈ ఆటిజంపై అవగాహన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులకు వీటిపై ఎక్కువగా అవగాహన లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆటిజంతో బాధపడే పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు ఆటిజంను దూరం చేయాలనే ఉద్దేశంతో గత నెలలో నేషనల్ ఆటిజం హెల్ప్ నెం. 190018181 ను శ్రీజారెడ్డి లాంచ్ చేశారు. దీని ఉద్దేశం.. ఏ మారుమూల ప్రాంతానికి చెందిన వారైనా తమ పిల్లల్లో ఆటిజం లక్షణాలు కనిపించినా, అనుమానం వచ్చినా ఫోన్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాక పేదల పిల్లలకు, ఆర్థిక స్థోమత లేనివారికి కోటి గ్రూప్ సేవా ఫౌండేషన్ ద్వారా 33శాతం రాయితీతో ఆటిజం పిల్లలకు థెరఫీని అందిస్తున్నారు. మరీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారి పిల్లలకు ఉచితంగానే సేవలు అందిస్తున్నారు. ఫలితం వారీ జీవితాల్లో సరిపల్లి కోటిరెడ్డి - శ్రీజారెడ్డిలు వెలుగు నింపుతున్నారు. రానున్న కాలంలోనూ ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు మరిన్ని సేవలు అందించి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే శ్రీజారెడ్డి గారు.
