చైనా పేరు ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది.  తమ దేశ భూభాగంతో సరిపెట్టుకోకుండా ఇతర దేశాల భూభాగాలపై ఎప్పుడూ కన్ను వేస్తూ విస్తరణ వాదంతో వివాదాలకు కారణం అవుతూ ఉంటుంది. ఇప్పటికే వివిధ దేశాల సరిహద్దుల్లో ఎన్నోరకాల వివాదాలు సృష్టించిన చైనా ఏకంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది.  ఎప్పుడు ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తమ ఆధిపత్యాన్ని సాధించాలా అని చూస్తూ ఉంటుంది. అందుకే చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు హాంకాంగ్.. టిబెట్ లాంటి దేశాల ను ఇప్పటికే తమ చెప్పుచేతల్లో పెట్టుకుంది.



 అంతేకాకుండా భారత్ కి మిత్ర దేశాలుగా ఉన్న నేపాల్ లాంటి దేశాలలో సైతం శత్రు దేశాలు గా మారేలా చేసింది. ఇక పాకిస్తాన్ ను ఎప్పటికప్పుడు భారత్ పై ఉగ్రవాదులను పంపించే విధంగా ప్రోత్సాహకం అందిస్తూ ఉంటుంది చైనా. ఇలా చైనా చేసే ప్రతి పని కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. మొన్నటి వరకు జపాన్లో ఉన్న దీవులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది చైనా అంతే కాదు భారత సరిహద్దుల్లో ఉన్న పాంగ్వాన్ సరస్సు భాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇక ఇప్పుడు విస్తరణ వాద కాంక్షతో ముందుకు సాగుతున్న చైనా ఎవరెస్ట్ శిఖరం పై కూడా కన్నేసినట్టు తెలుస్తోంది.




 ప్రస్తుతం ఎవరెస్టు సరిహద్దుల్లో టిబెట్ నేపాల్ చైనా దేశాలు ఉన్నాయి.అయితే ఇప్పటికే టిబెట్ చైనా చెప్పు చేతల్లోనే ఉంది. ఇక చైనా ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది అదే సమయంలో అటు నేపాల్లోని పాలకులు కూడా చైనా కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. చైనా ఏ స్క్రిప్ట్ ఇస్తే నేపాల్ పాలకులు ఆ స్క్రిప్ట్ ఫాలోఅవుతున్నారూ. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఎవరెస్ట్ పై కన్నేసిన చైనా ఏకంగా ఎవరెస్టుపై తమ దేశానికి సంబంధించిన భూభాగాన్ని మొత్తం స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. ఇటీవలే ఎవరెస్టు శిఖరం ఎక్కిన కొంతమంది కరోనా వైరస్ రావడంతో టిబెట్   నేపాల్ నుంచి ఎవరెస్టు శిఖరం పైన ఎక్కే వాళ్లను తమ దేశ భూభాగంలో కి రానివ్వకుండా ఇక తమ దేశానికి చెందినది అంటూ ప్రత్యేకంగా ఎవరెస్టు శిఖరాన్ని హద్దులు పెట్టే విధంగా చైనా ముందుకు సాగుతోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: