ఇక పుచ్చకాయ తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అందుకే ఎండాకాలంలో మాత్రమే దొరికే పుచ్చకాయలను తినడం ఎంతో మంచిది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక ఎక్కువగా ఎండలో ఉన్న సమయంలో పుచ్చకాయ తినడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది అని సూచిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక ఎండాకాలంలో పుచ్చకాయలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.
అయితే పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలుసు.. కానీ పుచ్చకాయ గింజలు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నది కొంతమందికే తెలుసు. అయితే పుచ్చకాయ గింజలు ఉడికించిన నీరు తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చట. అధిక రక్తపోటు గుండె సమస్యలను పుచ్చకాయ గింజలు ఉడకబెట్టిన నీరు నివారిస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా ఈ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు కూడా శుభ్రం అవుతాయట. ఇక ఇందులోని లైకోపిన్ క్యాన్సర్ను నివారిస్తుంది. డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు పురుషుల లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుందట. ఓవైపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరో వైపు జుట్టురాలే సమస్యకు కూడా చెక్ పెడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి