ప్రస్తుతం దేశమంతా కోవిడ్ పరిస్థితులతో సతమతమవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవైపు దేశ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చినా విషయము తెలిసిందే. తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా బాగుంది. కానీ అధికార పార్టీ కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి డీఎంకేకి మధ్యన అప్పుడే వివాదాలు మొదలయ్యాయి. జరగిన ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన సీట్లలో మెజారిటీ స్థానాలలోనే విజయాన్ని సాధించింది. దీనిని బట్టి గతంలో చూసుకుంటే కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే తమిళనాడులో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉండేవి. కానీ క్రమక్రమంగా ప్రాంతీయ పార్టీలతో పాటుగా జాతీయ పార్టీలకు కూడా ఆదరణ పెరుగుతూ వస్తోంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు రావడం, కాంగ్రెస్ పార్టీకి రెండంకెల సంఖ్యలో సీట్లు రావడం మరియు కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ప్రాధాన్యత పెరగడం. 

ఇలాంటి సందర్భంలో తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ జాతీయ పార్టీలను ఎదగకుండా తొక్కేయాలని ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఈయన ప్రాంతీయ జాతి భావాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామా ఆడింది. రాహుల్ గాంధీ మరణానికి కారణం అయిన వారిని మాట మాట్లాడకుండా ఉరితీయాలి. ఎందుకంటే వారు ఎల్టీటీఈ ని శ్రీలంకలో స్థాపించడం కోసం మన దేశ ప్రధానిని చంపడం ఎంతవరకు కరెక్ట్. ఉరితీయడం మానేసి వారికి క్షమాభిక్ష పెట్టామంటూ సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ ఇలా అందరూ ఒక పెద్ద డ్రామానే ఆడారు. ఇతర పార్టీలు పాలనలో ఉన్నప్పుడు విమర్శలు చేసి, తీరా సోనియా గాంధీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేపోయారు. కానీ ఈ విషయంపై కాంగ్రెస్ మీద విమర్శలు వస్తే మాత్రం అధికారులు మాట వినడం లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఆ హంతకులు ఇప్పటికే 24  సంవత్సరాలు శిక్షను అనుభవించారు. 

కానీ మాములుగా అయితే జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలు తరువాత విడిచి పెట్టేస్తారు.  కానీ అప్పట్లో వీరిని విడిచి పెట్టాలని కాంగ్రెస్ లేఖ రాసింది. కానీ అప్పటి ప్రభుత్వం దీనిని కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు ఇదే విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ వారిని విడిచి పెట్టాలని కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు విచిత్రంగా కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఎలా ఆడుతుందో అర్ధమవుతోంది.  ఈ లెటర్ పై కాంగ్రెస్ లోని పెద్ద వాళ్ళు ఒక ప్రధానిని తమిళనాడులో దారుణంగా చంపిన వారికి తమిళనాడు సీఎం సపోర్ట్ చేయడం ఏమిటని అభ్యంతరాన్ని తెలిపారు. కాగా కాంగ్రెస్ పి సి సి అధ్యక్షుడు మాత్రం ఇలాంటివి నిర్ణయయించడానికి మనమెవరు ? ఇవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి అని సేఫ్ గా వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ కి మరియు డిఎంకె కి మధ్య గ్యాప్ మొదలయిందని చెప్పవచ్చు.  మరి ఇది ఎంతదూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: