ఇక సుశాంత్ మరణానికి బాలీవుడ్లోని ఎంతోమంది పెద్దలే కారణం అంటూ ఎన్నో ఆరోపణలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక సుశాంత్ కేసులో ఎంతోమందినీ అరెస్టు చేసి ఇక విచారణ కూడా జరిపారు పోలీసులు. ముఖ్యంగా ఇక ఎన్నో రోజుల పాటు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. అయితే ప్రస్తుతం సుశాంత్ సింగ్ కేసు విషయం పూర్తిగా కనుమరుగయ్యింది అనుకుంటున్న తరుణంలో.. ఇటీవల మరోసారి సుశాంత్ ఆత్మహత్య కేసు తెరమీదికి వచ్చి సంచలనం గా మారిపోయింది.
దివంగత నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు ఎన్సిబి పోలీసులు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పితానిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో కలిసి సిద్ధార్థ్ మూడేళ్ల పాటు ఒకటే ఫ్లాట్ లో కలిసి ఉన్నాడు.. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో ఇక అటు సిద్ధార్థ్ ని కూడా పలుమార్లు విచారణ జరిపారు పోలీసులు. ఇక సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు చివరిసారిగా సుశాంత్ సిద్ధార్థ కి కాల్ చేసి మాట్లాడాడు. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు సుశాంత్ పర్సనల్ మేనేజర్ గా కూడా పనిచేసాడు సిద్ధార్థ్. అయితే ప్రస్తుతం సిద్ధార్థ ని అరెస్టు చేసి ఎలాంటి విచారణ జరపనున్నారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి