అయితే ఎల్.రమణ టిడిపి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అటు వరుసగా ఎన్నికల్లో ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు ఆయన. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎల్.రమణ కు నిరాశే ఎదురైంది కేవలం ఐదు వేల ఓట్లతో మాత్రమే వెను తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే కాదు జీహెచ్ఎంసీ ఎన్నిక, స్థానిక ఎన్నికలు అప్పుడెప్పుడో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా ఎన్నికల్లో కూడా తుడిచిపెట్టుకుపోయింది టిడిపి పార్టీ.
అయితే ఇక ఎన్నో రోజుల నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతున్న ఎల్.రమణ మరికొన్ని రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే టిఆర్ఎస్ పార్టీలో బలమైన బిసి నాయకుడిగా ఉన్న ఈటెల బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఇక మళ్ళీ బీసీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునేందుకు బీసీ నేత అయిన ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎల్.రమణ కు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా ఉంది అనే టాక్ వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి