గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి, పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ ఎక్కువైన విషయం తెలిసిందే. చంద్రబాబుకు వయసు మీద పడటం, నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేదని చెబుతూ, కొందరు టీడీపీ కార్యకర్తలు పార్టీలోకి ఎన్టీఆర్ వస్తే బెటర్ అని మాట్లాడుతున్నారు. అలాగే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం కొందరు ఎన్టీఆర్ జెండా కట్టి హడావిడి చేశారు.
ఇలా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట తన ఇద్దరు అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్‌లు గురించి చెప్పుకొచ్చారు. టీడీపీలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారు అనేవిధంగానే బాలయ్య మాట్లాడారు. కానీ జూనియర్ విషయానికొస్తే కాస్త అనాసక్తి ప్రదర్శించారు.
టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టాలని డిమాండ్ వస్తుందని, అలాగే ఎన్టీఆర్ వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా అనే ప్రశ్నలు యాంకర్ అడుగగా, వాటికి సమాధానంగా బాలయ్య... రాజకీయాల్లోకి రావడం అనేది ఎవరి ఇష్టం వాళ్ళది అని, దాని గురించి ఏం ఆలోచించను అని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ వస్తే ప్లస్ అయ్యి, మైనస్ అయితే ఏంటి పరిస్తితి అని ఎదురు ప్రశ్న వేశారు. సీనియర్ ఎన్టీఆర్‌లాగా ఎవరు రాజకీయాల్లో సక్సెస్ కాలేరని మాట్లాడారు.
ఇక బాలయ్య మాటలు బట్టి చూస్తే, జూనియర్ పార్టీలోకి వచ్చినా, రాకపోయినా ఇబ్బంది లేదన్నట్లుగానే ఉన్నాయి. అయితే జూనియర్ వస్తే తన పెద్దల్లుడు లోకేష్‌కు మాత్రం ఇబ్బంది అవుతుందని అనేక విశ్లేషణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక అల్లుడుని పైకి లేపాలనే ఉద్దేశంతో బాలయ్య ఉన్నట్లున్నారు. అందుకే జూనియర్ పోలిటికల్ ఎంట్రీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి