ప్రపంచాన్ని  మొత్తం కరోనా  కబలించేస్తున్న సమయంలో  వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ప్రజలకు కాస్త ఊరట కలిగించింది, మరియు భరోసాను పెంచింది. వెంటనే కాకపోయినా నిదానంగా అయినా వ్యాక్సినేషన్ ప్రజలందరికీ అందే కొద్ది ఈ మాయదారి కరోనా మనల్ని విడిచి వెళ్ళిపోతుందని నమ్ముతున్నారు. అయితే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని పలువురు ప్రముఖులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్ మొదటి డోసు మరియు రెండో  డోసు ల మధ్య గ్యాప్ ఇస్తూ టీకాను  అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ అంటు వ్యాధి నివారణ నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచి . 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యాక్సిన్ ల గురించి పలు కీలక అంశాలపై వ్యాఖ్యానించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ ఫస్ట్ డోసుకి ...సెకండ్ డోస్ కి మధ్యన గ్యాప్ ఎక్కువగా ఉండడం వలన ప్రజలు కొత్తగా కరోనా వేరియంట్ల బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలియచేశారు. డోస్ ల మధ్య విరామం ఎక్కువగా ఉండటం వలన ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నటువంటి కొత్త కరోనా వేరియంట్ భారిన పడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ లో ఇలాంటి కేసులే నమోదైనట్లు ఆయన తెలియజేశారు.  కాబట్టి ఇలా జరగకుండా చూసుకోవాలని మొదటి మరియు రెండవ డోసుల మధ్య కాల వ్యవధిని మరింత తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  

ఎంఆర్ఎన్ఏతో అభివృద్ధి చేసిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ లను అమెరికా ప్రజలకు అందిస్తున్న విధానం గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖ నిపుణులు వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి తగ్గించడం మంచిదని గంటా పథంగా వ్యాఖ్యానిస్తున్న వేళ ప్రభుత్వాలు ముందు ముందు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: