ప్రస్తుతం సోషల్ మీడియా కావొచ్చు లేదా వార్తా ఛానళ్ళు కావొచ్చు ప్రసారం చేసే వార్తలలో పూర్తిగా వాస్తవాలు ఉండట్లేదన్నది అంగీకరించాల్సిన విషయం. అయితే ఇలాంటి వార్తలు ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకపోతే ఓకే, కానీ ఆ వార్తలు మనిషికి ఇబ్బంది కలిగించేదిగా ఉంటే చాల దారుణంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా వైరస్ గురించి వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపించి కొన్ని వార్తా చానెళ్లు ప్రజలను కంగారు పెడుతున్నాయి. ఇందులో భాగంగా రానున్న కరోనా మూడవ వేవ్ పై పలు విషయాలు ప్రజలందరినీ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని చెప్పాలి.  ఇందులో భాగంగానే బాధ్యతాయుతమైన ఒక కెమికల్ ఇంజనీర్ థర్డ్ వేవ్ గురించి చేసిన వ్యాఖ్యలు సగటు మానవుడు తలదించుకునేలా ఉన్నాయి. అయితే ఒక ఇంజనీర్ ఏ విధంగా  చేసిన వ్యాఖ్యలపై పబ్లిక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎటువంటి ఆధారం లేకుండా ఒక ప్రాణాంతకమైన వైరస్ గురించి మాట్లాడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని అతనిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

ఇలాంటి వారికి సామజిక బాధ్యత లేదంటూ అతని తీరును దుయ్యబడుతున్నారు. ఈ విషయం గురించి డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి కింది విధంగా స్పందించారు. ప్రజలంతా స్పృహతో ఉండండి. ఇటువంటి అసత్య ప్రచారాలను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి అంటూ తెలిపారు.  ప్రజలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు, కనీస సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించిన అతనిపై ఇప్పటికే పోలీసు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిపారు.  సదరు ఇంజినీరు చెబుతున్నట్లుగా థర్డ్ వేవ్ లో కేవలం పిల్లలకే ఎక్కువ ఎఫెక్ట్  అన్నమాటలు పూర్తిగా నిరాధారం. ఇప్పటికే రెండు దశలు వచ్చి పోయాయి. ఇప్పుడు మూడవ వేవ్ వస్తుందన్నది ఊహాగానాలు మాత్రమే, అసలు అది వస్తుందో రాదో కూడా ఒక స్పష్టత లేదు. పిల్లల తల్లితండ్రులు భయపడాల్సిన అవసరం లేదని. కానీ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బహుశా పిల్లల్లో లక్షణాలు ఏమీ కనబడకపోవచ్చు. కాబట్టి ఎటువంటి లక్షణం అయినా మీకు గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆయన చెప్పారు. కానీ కరోనా మూడవ దశ వచ్చిన రాకపోయినా మా జాగ్రత్తలో మేమున్నాం. పిల్లలకు మరియు పెద్దలకు సంబంధించిన అన్ని ముందస్తు చర్యలను తీసుకున్నామని రమేష్ రెడ్డి తెలిపారు. 

ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి యుద్ధ ప్రాతిపదికన కష్టపడుతున్నామని తెలిపారు. అందరూ ఎంతో భయంకరమైనదని విస్తృతంగా ప్రచారం జరిగిన మ్యుకర్ మైక్రోసిస్ భారీగా తగ్గిందని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. కరోనా కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువ మంది, భయం వల్లనే మరణించారని తెలిపారు. ఇక్కడ బ్లాక్ ఫంగస్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బయటపడ్డామని తెలిపారు. నెల రోజుల కాలంలో హాస్పిటల్స్ లో ఉన్న 5 వేల బెడ్స్ కు ఆక్సిజన్ ను ఏర్పర్చు చేశామని తెలియచేశారు. కొత్తగా నిలోఫర్ హాస్పిటల్ లో దాదాపు 2 వేల బెడ్స్  ఏర్పాటు చేసినట్లుగా రమేష్ రెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: