మొదటినుంచి ఆయుధ సంపత్తి కోసం విదేశాలపై ఆధారపడటం తప్ప ఆయుధాలను తయారు చేసుకో లేని భారత్ ఇప్పుడు మాత్రం ప్రపంచ దేశాలకు ఆయుధాలను విక్రయించే స్థాయికి చేరుకుంది. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ప్రస్తుతం భారత్ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఆయుధ తయారీ రంగంలో భారత్ వృద్ధి చెందుతున్న తీరు ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శం గా నిలుస్తోంది.  ముఖ్యం గా గత కొన్నేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగానికి పూర్తిస్థాయి ప్రోత్సాహం అందిస్తున్న నేపథ్యంలో.. ఇక శాస్త్రవేత్తలు అధునాతన ఆయుధాలను కనుగొనడంలో సక్సెస్ అవుతున్నారు.




 ఇక ఇప్పటికే భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అధునాతన టెక్నాలజీతో కూడిన మిస్సైల్స్  అభివృద్ధి చేసి.. వాటికి ప్రయోగాలు నిర్వహించి విజయవంతమైంది. అంతేకాదు ఇప్పటికే కొన్ని రకాల క్షిపణులను  విదేశాలకు సైతం విక్రయాలను ప్రారంభించింది భారత్.  అయితే ఇక భారత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ మరింత అభివృద్ధి చేసేందుకు ఇటీవల భారత  రక్షణశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే  R&D  విభాగానికి భారీగా నిధులు కేటాయించినా కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసింది.



 దేశంలో రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన అటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి ఇటీవలే 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు  భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. అయితే భారత రక్షణ రంగం మరింత పటిష్టవంతంగా మారడానికి మరిన్ని అధునాతనమైన ఆయుధాలు తయారు చేయడానికి.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వేసిన ముందడుగు ఎంతో గొప్పది అంటూ అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఇక రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి R&D విభాగానికి ఇదే తరహా ప్రోత్సాహం కొనసాగితే రక్షణ రంగంలో భారత్ అత్యున్నత శిఖరాలను అందుకోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: