సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే జనసేన పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ మొదట టిడిపితో జతకట్టి చంద్రబాబుతో స్నేహం చేశారు. ఇక ఆ తర్వాత వీరి పొత్తు కాస్త బెడిసి కొట్టి చివరికి 2019 ఎలక్షన్లలో ఒంటరిగానే పోటీ చేసింది జనసేన..  ఆ సమయంలో జనాలు జనసేన ను నేలకేసి కొట్టినంత పని చేశారు.  రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఒకే ఒక్క సీటు గెలిచింది జనసేన. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ కు మద్దత్తు గా ఉండని పరిస్థితి నెలకొంది.  అయినప్పటికీ వెనకడుగు వేయని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావాలి అనే నినాదంతో అటు బీజేపీతో జతకట్టారు.

 ఇక ప్రస్తుతం ఏపీలో జనసేన,బిజెపి పార్టీలు పొత్తు గా ముందుకు వెళ్తున్నాయ్. ప్రతి ఎన్నికల్లో కూడా ఈ పొత్తు కొనసాగిస్తున్నాయి. అయితే గతంలో చంద్రబాబు తో స్నేహం అంతగా అచ్చి రాకపోయినప్పటికీ.. ఇక ఇప్పుడు బీజేపీతో స్నేహం మాత్రం పవన్ కళ్యాణ్ కు బాగా కలిసివచ్చే లాగానే కనిపిస్తుంది. ఎందుకంటే 2019 లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే..  కనీస మెజారిటీ ఓట్లు కూడా దక్కించుకోలేక ఓటమి పాలయ్యారు. అయితే ఇలా ఎమ్మెల్యేగా ఓటమిపాలు అయినప్పటికీ ఇక ఇప్పుడు బీజేపీతో స్నేహం కారణంగా ఏకంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది..

 బీజేపీతో పొత్తు పెట్టుకుని స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో పదవి అప్పగించాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారట. అయితే ఇప్పట్లో లోక్సభ సభ్యుడిగా నియమించి ఇక కేంద్రమంత్రి పదవి అప్పజెప్పే అవకాశం లేదు కాబట్టి.. రాజ్యసభలో పవన్ కళ్యాణ్ కు చోటు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.  రాజ్యసభ సభ్యుడిగా నియమించిన తర్వాత ఏదో ఒక శాఖకు పవన్ కళ్యాణ్ మంత్రిగా నియమించబోతున్నారట. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఒక్క పదవిలో కూడా కొనసాగని పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కారణంగా ఇక ఇప్పుడు ఏకంగా నేరుగా కేంద్ర మంత్రి పదవి చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: