మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో  విపత్కర  పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో చివరికి కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ అంతలోనే బ్లాక్ ఫంగస్ అనే మహమ్మారి దూసుకువచ్చి జనాల ప్రాణాలు తీసేందుకు సిద్ధమైంది.



 ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు కంటే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు పెద్దల్లో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి ఇక ఇప్పుడు చిన్నారుల్లో కూడా వెలుగులోకి వస్తు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే 4,6 పద్నాలుగేళ్ల చిన్నారులు బ్లాక్ ఫంగస్ బారిన పడగా ఇక చివరికి వైద్యులు కళ్ళు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక ఈ వార్త బయటకి రావడంతో ప్రస్తుతం అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక కు డయాబెటిస్ సమస్య ఉంది. ఇటీవలకాలంలో ఇబ్బందిగా కళ్ళల్లో అనిపించగా ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు  దాదాపు ఆరు వారాల పాటు వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి బాలిక కన్నూ తొలగించారు వైద్యులు.



 ఇక మరో ఇద్దరు చిన్నారులకు డయాబెటిస్ లాంటి సమస్యలు లేనప్పటికి కరోనా వైరస్ బారిన పడ్డారు  ఆ తర్వాత మనోధైర్యంతో వైరస్ను జయించారు. ఇక కొన్ని రోజుల్లోనే బ్లాక్ ఫంగస్ సోకింది  ఇక ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. చివరికి ఇక పరిస్థితి చేయి దాటి పోతుందని భావించిన వైద్యులు కన్నూ తొలగించారు. అయితే చిన్నారులకు ఇక ఎక్కువగా బ్లాక్ ఫంగస్ ప్రభావం ఉండటంతో ఇక శస్త్రచికిత్స చేయక తప్పలేదు అంటూ వైద్యులు తెలిపారు  ఒకవేళ శస్త్ర చికిత్స చేయకపోతే వారి జీవితమే ప్రమాదంలో పడేది అంటూ చెప్పుకొచ్చారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: