ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ రాహుల్ గాంధీ వైపు ఆశగా చూస్తున్నారు.  ఒకప్పుడు తిరుగు లేని చరిష్మా కొనసాగించిన కాంగ్రెస్ పార్టీకి.. మరోసారి అలాంటి పునర్ వైభవాన్ని తీసుకు రావడానికి రాహుల్ ఒక్కడే సమర్ధుడు అని భావిస్తున్నారు.  ఒకప్పుడు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం రాహుల్ గాంధీ రాజకీయ అనుభవం సాధించారు.  అందుకే ఇక రాహుల్ పార్టీని ముందుకు నడిపించేందుకు సమర్ధుడు అని ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేతలు అందరూ భావిస్తున్నారట. అయితే మొదటి నుంచి రాహుల్ గాంధీకి పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు మాత్రమే ఎంతో సన్నిహితం గా ఉంటారట.



 ఇక పార్టీకి సంబంధించిన వ్యవహారాలను ముఖ్యం గా తనకు సన్నిహితం గా ఉన్న పార్టీ సీనియర్ నేతలతో చర్చించేందుకు రాహుల్ గాంధీ ఎక్కువగా ఇష్ట పడతారట  అంతే కాదు పార్టీ లోని కొంత మంది పై ఎక్కువగా నమ్మకం ఉంచుతారట రాహుల్ గాంధీ. ఇలా నమ్మకం ఉంచిన నేతలలో అటు కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ టాప్ లీడర్ కూడా ఉన్నారు అన్నది అందరికి తెలిసిందే.  కర్ణాటక కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కేసీ వేణు గోపాల్. కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు.


 ఇలా రాహుల్ గాంధీ పార్టీ లో అపారమైన నమ్మకం ఉంచిన నేతలలో కేసి వేణు గోపాల్ మొదటి స్థానం లో ఉంటారట. కేసి వేణుగోపాల్ ను రాహుల్ గాంధీ అన్నయ్య అని కూడా పిలుస్తారట.  రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ముందుకు రాకపోతే కేసి వేణుగోపాల్ పార్టీ చీఫ్ గా మారే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా కేసి వేణుగోపాల్ కి రాహుల్ గాంధీకి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి నమ్మినబంటుగా, అత్యంత సన్నిహితుడిగా కొనసాగుతున్నారు కేసి వేణుగోపాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: