ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతుంది.  చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిపోయిన కరోనా వైరస్ చైనా ను వదిలి పెట్టింది. కానీ ప్రపంచ దేశాలను మాత్రం పట్టి పీడిస్తూనే ఉంది.  అయితే ఒక రకం వైరస్ను ప్రస్తుతం అన్ని దేశాల ప్రభుత్వాలు సమర్థవంతంగా కట్టడిచేసి కేసును తగ్గేలా చేసాయ్. ఇక అదే సమయంలో రూపాంతరం చెందుతున్న వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ అన్ని దేశాలను వణికిస్తుంది.  సెకండ్ వేవ్ కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో ఎంతటి అల్లకల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతుంది. ఇంకెంతో మంది ప్రాణాలను బలితీసుకుంది ఈ మహమ్మారి కరోనా.  అదే సమయంలో అటు వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్, జపాన్ లాంటి దేశాలు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసాయి. తమ దేశంలో 80 శాతానికి పైగా టీకా ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఆయా దేశాలలో కొన్ని సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వాలు.  ఒకప్పుడు మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అనే నిబంధన ఉండేది  కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడంతో ఇక మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి కాదు అనే సడలింపు ఇచ్చింది.



 కానీ ఇప్పుడు మళ్లీ విపత్కర పరిస్థితులు ముంచుకొస్తున్నాయి  దీంతో మళ్ళీ  మాస్క్ పెట్టుకోవాలి అన్న నిబంధనలు అమలులోకి తెస్తున్నాయ్.  ఇటీవల ఇజ్రాయిల్ కూడా తమ దేశంలో 80 శాతానికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయిందని అందుకే ఇక తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటూ నిబంధనలను సడలించింది.  కానీ ఇటీవలే పాత నిబంధన మళ్ళీ అమలులోకి తెచ్చింది.  కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరిగిపోతున్న నేపథ్యంలో పాత నిబంధనలు అమలులోకి తెచ్చింది. ఇక తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందే అంటూ సూచించింది.  మరి కొన్ని రోజుల్లో ఇక మాస్ పెట్టుకోవడం తప్పనిసరి కాదు అని సడలింపు ఇచ్చిన దేశాలు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: