కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు డిఆర్డిఓ కి పూర్తిస్థాయి ప్రోత్సాహకం అందుతుంది. దీంతో భారత రక్షణ పరిశోధన సంస్థ శరవేగంగా ఆయుధాలను తయారు చేస్తోంది. ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను తయారు చేస్తూ ఇక వాటి ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ అవుతుంది భారత రక్షణరంగ పరిశోధన సంస్థ.  అయితే వినూత్నమైన ఆయుధాలను తయారు చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిస్థాయిలో నిధులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇక డి ఆర్ డి ఓ  శాస్త్రవేత్తలు మరింత వేగంగా వినూత్న ఆయుధాల తయారీకి పూనుకుంటున్నారు.



 అయితే ఇప్పటికే భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ దాదాపు 11 కు పైగా అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపణులను అభివృద్ధి చేసింది. అంతే కాదు వాటికి ప్రయోగాలు నిర్వహించి విజయవంతం అయింది డిఆర్డిఓ. ఇక మరికొన్ని ఆయుధాల కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు డి.ఆర్.డి.ఓ మరో  అద్భుతమైన ఆయుధాన్ని  కనుగొన్న ట్లు తెలుస్తోంది.  ఇటీవలే డీఆర్డీవో అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ ఎంతో విజయవంతంగా పరీక్షించింది.  ఇటీవల డి ఆర్ డి ఓ   అభివృద్ధి చేసిన కొత్త క్షిపణి ఎంతో సమర్థవంతంగా లక్ష్యాలను చేధిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.



 అత్యాధునిక అగ్ని ప్రేమ్ బాలిస్టిక్ క్షిపణిని భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ తయారు చేసింది. ఇటీవల దీనిని రక్షణశాఖ ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం  ద్వీపం నుంచి ప్రయోగించారు.  ఇక డి ఆర్ డి ఓ  ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరిగాయి. ఈ ప్రయోగంలో క్షిపణి  ఎంతో సమర్థవంతంగా లక్ష్యాలను ఛేదించింది. టెలిమెట్రి, రాడార్ స్టేషన్లు ఇక అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణిని సమర్థవంతంగా  పర్యవేక్షించి నట్లు రక్షణశాఖ ఇటీవలే తెలిపింది  . కాంపోజిట్ పదార్థాలతో తయారు చేసిన ఈ అధునాతన క్షిపణి అణు హెడ్ లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉందట. 1000 నుంచి 2000 కిలోమీటర్లు ఉన్న లక్ష్యాలను ఎంతో సమర్థవంతంగా ధ్వంసం చేయగలదు అని ఇటీవల నిర్వహించిన ప్రయోజనాల్లో తేలిందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: