ఉత్తరప్రదేశ్ లోని మధుబార్ గ్రామానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళ.. మహిళ ఏకంగా అల్లుడితోనే రాసలీల కార్యక్రమం కొనసాగించింది. ఆ అల్లుడికి తన వయసులో సగం కూడా ఉండకపోవడం విడ్డూం. అవ్వా... అనిపించే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జిల్లా మధుబార్ గ్రామానికి చెందిన మహిళ... తన అల్లుడినే బుట్టలో వేసుకుని... శారీరక సంబంధం పెట్టుకుంది. ఇలా ఉండగా... వారు 10 నెలల కిందట ఇళ్లు వదిలి పారిపోయి.. పెళ్లి చేసుకున్నారు. కాని ఏం జరిగిందో ఏమో సడెన్ గా బుధవారం రోజు ఇంటికి వచ్చి చేరుకున్నారు. ఈ ఘటనతో షాక్ అయిన పోలీసులు సదరు జంట వల్ల గ్రామంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదముందని భావించి... వారిని అరెస్టు చేశారు. అల్లుడితో శారీరక సంబంధం పెట్టుకున్న మహిళకు ముగ్గురు మనుమరాళ్లు ఉన్నారు. అల్లుడితో సదరు మహిళ సాగిస్తున్న .... రాసలీలల గురించి ఇంట్లోని వారికి తెలియడంతో వారంతా అగ్గి మీది గుగ్గిళం లా మండిపడ్డారు. ఈ పరిణామంతో కంగు తిన్న సదరు జంట... ఇంట్లోంచి పారిపోయి ఒక్కటయ్యారు.


తాజాగా... బుధవారం వీరిద్దరూ తిరిగి ఇంటికొచ్చారు. అంతే కాకుండా తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని ఇంట్లో వాళ్లకి కూడా చెప్పారు. ఈ విషయం విన్న కుటుంబసభ్యులు షాక్ కు గరయ్యారు. ఆ నోట, ఈ నోట ఈ విషయం ఊరంతా తెలియడంతో గ్రామస్తులు ఈ ఇద్దరి బంధాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ... నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన పోలీసులు... అక్కడకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా వీరిపై 151 వ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. ఎలాంటి వారినైనా ఈ సెక్షన్ కింద అరెస్టు చేసే వీలుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: