దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతున్న సమయంలో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా వ్యాక్సిన్ అందజేస్తాము అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తోంది భారత ప్రభుత్వం. ఇక వ్యాక్సిన్ ఫై ఇప్పటికే ఎంతో మందిలో అవగాహన కూడా రావడంతో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇలా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగంగా కొనసాగుతోంది.



 18 సంవత్సరాల నుండి ఇక ఎంత వయస్సు ఉన్న వారైనా సరే వ్యాక్సిన్ వేసుకోవచ్చు అంటూ ఇప్పటికే వైద్య నిపుణులు సూచించారు. కానీ చిన్న పిల్లలు గర్భిణీలు  మాత్రం వ్యాక్సిన్ వేసుకోవద్దు అంటూ తెలిపారు నిపుణులు. అయితే గర్భిణులు చిన్న పిల్లలు వాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయి అన్న విషయంపై పలు అధ్యయనాలు కూడా జరిపారు. ఇటీవల జరిపిన అధ్యయనంలో అందరికి శుభవార్త చెప్పారు శాస్త్రవేత్తలు.  ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన వారు అందరూ వ్యాక్సిన్ వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇక నుంచి అటు గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చు అంటూ ఇటీవల కేంద్రం తెలిపింది.



 గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు అంటూ స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైసరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రతిపాదనలకు ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. ఇక ఇప్పటి నుంచి గర్భిణీ స్త్రీలు కూడా కేంద్ర ప్రభుత్వం సూచించిన కోవిన్ యాప్లో లేదా ఇక దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని గర్భిణీ స్త్రీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. అయితే ప్రస్తుతం కరోనా వైరస్  పోరాటంలో టీకా కీలకంగా మారిన నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు కూడా వ్యాక్సిన్ చేసుకునేందుకు అనుమతి రావడం శుభపరిణామం అని  అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: