ఇక ఇంతవరకు బాగానే ఉందిగానీ, రేవంత్ ఎంత దూకుడుగా విమర్శలు చేస్తున్నారో, అంతే స్పీడుగా కౌంటర్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అని చెప్పి కామెంట్లు వస్తున్నాయి. టీపీసీసీ కాస్త టీటీడీపీ మాదిరిగా మారిందని కోమటిరెడ్డి లాంటి వారు మాట్లాడారు. ఇలా చంద్రబాబు పేరు చెప్పడం వల్ల రేవంత్‌కు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషణలు వస్తున్నాయి.
అందుకే రేవంత్‌కు కౌంటర్లు ఇవ్వాలంటే ప్రత్యర్ధులు చంద్రబాబు పేరుని తీస్తూనే మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ, రేవంత్‌పై విమర్శలు చేశారు. గతంలో సోనియాని బలిదేవత అని మాట్లాడిన రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారని, కొన్ని రోజులు పోతే చంద్రబాబుని తెలంగాణ దేవుడు అంటారేమో అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే టీపీసీసీ కాస్త టీడీపీసీసీగా మారిందని అంటున్నారని మాట్లాడారు.
ఇక ఏపీ ఎమ్మెల్యే రోజా సైతం రేవంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడారు. అది కూడా చంద్రబాబు ప్రస్తావన తీసుకోస్తూ విమర్శించారు. తెలుగుదేశం కోవర్టుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, చంద్రబాబు..కేసీఆర్‌కు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసింది రేవంత్‌కి గుర్తు లేదా? అంటూ ఫైర్ అయ్యారు. అంటే రేవంత్‌ని విమర్శించాలంటే చంద్రబాబు పేరు తీసే విమర్శిస్తున్నారు.
మరి ఇలా రేవంత్‌ని టార్గెట్ చేయడం వల్ల భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని చెప్పి అక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ వచ్చింది. దాని వల్లే అక్కడ టీడీపీ కనుమరుగైంది. ఇప్పుడు చంద్రబాబు పేరు తీస్తూనే రేవంత్‌పై విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పుడు రేవంత్‌కు ఏ విధంగా ఇబ్బంది అవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి