ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రేంజిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా సామాన్యుడి జీవితం కాస్త అల్లకల్లోలం అయిపోయింది. కనీస ఉపాధి లేక తినడానికి తిండి లేక కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు సామాన్యులు.  పరిస్థితులు కాస్త సద్దుమణుగుతు న్నాయి అనుకునేలోపే మళ్లీ వైరస్ రూపాంతరం చెందుతూ విజృంభిస్తుంది. దీంతో సామాన్యుడి జీవితం మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది.



 ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేక సామాన్యుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇలాంటి సమయంలో అటు నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి..  ఏల్పీజి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి సమయంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ఉండటం మాత్రం సంచలనంగా మారిపోయింది.  అయితే ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో సెంచరీ దాటిపోయాయి. దీంతో సామాన్య ప్రజలపై భారం ఎంతగానో పడుతుంది. అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు పేద మధ్య తరగతి ప్రజలు.



 అయితే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్ర మంత్రి  అశోక్ చవాన్ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు  దేశంలో పెట్రోల్ కంటే లిక్కర్ ఎంతో చీప్ గా దొరుకుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పెట్రోల్ ధరలు  రెండు రూపాయలు పెంచితే ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నిరసనకు దిగింది. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పెట్రోల్ ధరలు సెంచరీ దాటిపోయాయి.  మరోవైపు ఎల్పిజి సిలిండర్ ధరను కూడా  మూడు రేట్లు పెరిగాయి అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అశోక్ చవాన్. వీటి వల్ల అటు నిత్యావసరాల ధరలు కూడా పెరిగి సామాన్యుడి పరిస్థితి ఎంతో భారంగా మారిపోతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: