హుజురాబాద్ లో నేతల మధ్య  మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరినొకరు ద్వేషించుకొంటూ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ పాదయాత్ర ప్రారంభించింది. ఆ పాదయాత్ర ఉద్దేశించి టిఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ప్రజల కోసం ఏ రోజు కూడా పాదయాత్ర చేయని ఈటెల రాజేందర్, తన గెలుపు కోసం పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.

హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాజేందర్ తప్పుడు పనులు చేసినందు వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను భర్తరఫ్ చేశారని తెలిపారు. తన అక్రమ ఆస్తులను కాపాడుకు నెందుకు ఈటల రాజేందర్ బిజెపిలో చేరాలని ఆరోపించారు. ఆయనకు అక్రమాస్తులు లేకుంటే బిజెపిలో ఎందుకు చేరారని, ఇండిపెండెంట్ గా ఉంటేనే నిజాయితీ ఉండేదని అన్నారు. నిచమైన సంస్కృతి ఈటెల రాజేంద్రదని తన ఓటమిని చూసేందుకు అయినా బ్రతికే ఉండాలని  ఆమె అన్నారు. బండి సంజయ్, రఘునందన్ రావులు  గతంలో డ్రామాలు చేసి గెలిచారని, ఈటల గెలుపు కోసం కూడా డ్రామాలు చేయడం నిజమైన చర్యని కనుమల్ల విజయ ఆరోపించారు. కార్యదర్శి బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ నయీమ్ మించిన దొంగ అని ఆయనను చంపే అవసరం ఎవరికీ లేదని, ఈటెల  భయంతోనే అలా మాట్లాడుతున్నారని అన్నారు.

ఆయనే అత్యాశకు పోయి పార్టీకి దూరం అయ్యారని తెలిపారు. చంపేసే అంత నిజమైన సంస్కృతి టిఆర్ఎస్ పార్టీలో లేదని అన్నారు. ఈ విధంగా నాయకుల మధ్య మాటలు పేలుతున్నాయి. ఇలా ఒకరినొకరు ద్వేషించుకొంటూ తమదైన శైలిలో గెలుపు  కోసం ప్రచారాలు చేస్తూ, సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏది ఏమైనా  ప్రజల మనసులో ఏ అభ్యర్థి ఉన్నారో ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: