తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా కొనసాగుతోంది. ఇక టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ వారసుడిగా, టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కేటీఆర్. తనదైన శైలిలో రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతూ ఉంటారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేయాలన్న..  తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకోవాలి అన్న కేటీఆర్ ఎంతో సమర్ధుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కెసిఆర్ తన మాటలతోనే ప్రజలు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు. కేటీఆర్ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇలా అధికార పార్టీలో కీలక నేత అయిన కేటీఆర్ పుట్టినరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఎవరు తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవద్దు అంటూ కేటీఆర్ సూచించారు. అయినప్పటికీ అభిమానులు వినరు కదా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏదో ఒక విధంగా బర్త్ డే వేడుకలు జరుపుకుంటారు. ఇక నేడు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు నేతలు ఘనంగా సెలబ్రేషన్స్ కి ఏర్పాట్లు చేస్తున్నారు


 అయితే తన పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలి అనుకున్న వారు తప్పనిసరిగా ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగం కావాలి అంటూ అందరికీ పిలుపునిచ్చారు కేటీఆర్. అయితే ఇటీవలే ఇక ముక్కోటి ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఇటీవలే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ జిల్లాలో వర్షపాతం నమోదవుతుంది  అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతి ఒక్కరూ ఈ ముక్కోటి వృక్ష అర్చన  కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతే తనకు మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లు అవుతుంది అంటూ పిలుపునిచ్చారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల 30 లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాటు జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: