జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఎంతో సమర్థవంతంగా అందే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉద్యోగులను కూడా నియమించింది. ఇక ఒకే సారి లక్ష మందికి పైగా నిరుద్యోగులను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది  అయితే దాదాపు రెండేళ్ళ తరువాత ఇటీవలే గ్రామ వార్డు సచివాలయ పనిచేస్తున్న వారికి ట్విస్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.  రెండేళ్ల తర్వాత వీరందరినీ కూడా ఇక్కడ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తాము అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.



 కానీ ఇటీవలే ట్విస్ట్ ఇచ్చింది. మరో మూడు నెలల్లో 1.34 లక్షల మంది ఉద్యోగులు సర్వీసు పూర్తి చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఇక తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నాము అని అనుకున్నారు  కానీ ఇంతలోనే గ్రామ వార్డు సచివాలయం లో పనిచేసే ఉద్యోగులందరికీ రెండు దశల్లో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. అయితే ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతే శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తారు అన్న టాక్ మొదలైంది  ఒకవేళ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోతే మళ్ళీ శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు అన్న ప్రచారం ఊపందుకోవడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.



 తాజాగా దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్వహించే పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ వారి సర్వీసు నుంచి తొలగించే అవకాశం లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఈ విషయాన్ని ఇటీవలే సచివాలయ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పినట్లు తెలుస్తోంది.  కేవలం ఉద్యోగుల యొక్క నైపుణ్యం తెలుసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమైంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఏపీ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన పరీక్షలకు.. ఉద్యోగుల తొలగింపు లేదా క్రమబద్ధీకరణకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.  దీంతో గ్రామ వార్డు సచివాలయం లో పనిచేస్తున్న ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: