ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నేటి రోజుల్లో దాంపత్య బంధానికి కాస్తయినా విలువ ఇవ్వడం లేదు ఎవరు. ఏకంగా పెళ్లి అనే బంధంతో ఒక్కటైనప్పటికీ చివరికి పరాయి వ్యక్తుల మోజులో పడి కాపురాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే ఎన్నో హత్యలు ఆత్మహత్యలు కూడా జరిగిపోతున్నాయి. అయితే కట్టుకున్నవారు వేరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు అనే కారణంతో పగతో రగిలిపోయి ఏకంగా కట్టుకున్న వారిని ఉన్మాదులు గా మారిపోయి కడతేరుస్తున్నారు. మరి కొంతమంది ఏకంగా పరాయి వ్యక్తుల మోజులో ఇక సుఖానికి అడ్డు వస్తున్నారని కట్టుకున్న వారిని దారుణంగా దారుణంగా హతమార్చారు.




 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది  తన భార్యతో మరొక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న కారణంతో ఆ భర్త ఏకంగా సైకో గా మారిపోయాడు. ఏకంగా తన భార్య ప్రియుడు యొక్క ముక్కు చెవులు కోసి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటన స్థానికంగా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రం  లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ముజఫర్ ఘడ్ కి చెందిన అక్రమ్ అనే వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ మహిళకు  అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.



 అయితే ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు అని తెలిసినప్పటికీ సదరు వ్యక్తి మాత్రం మహిళతో భర్తకు తెలియకుండా రాసలీలలు కొనసాగిస్తూనే వచ్చాడు. అయితే కొంతకాలం నుంచి భర్త భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా తనకు తెలియకుండా ఎవరితోనో ఫోన్లో రహస్యంగా మాట్లాడుతూ ఉండటాన్ని కూడా గమనించాడు. ఈ క్రమంలోనే భార్యపై ఒక కన్నేసి ఉంచాడు భర్త. ఇక ఓ రోజు తన భార్య అక్రమ్ అనే యువకుడు తో రాసలీలలు కొనసాగిస్తుండగా గమనించాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త ఖయుమ్. ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న కత్తితో ఏకంగా భార్య ప్రియుడు యొక్క ముక్కు చెవులు కోశాడు. ఇక తీవ్ర రక్తస్రావం అవుతున్న అక్రమ్ ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు  స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: