ఎంతోమంది మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో కూడా వివిధ రకాల నేరాలలో జైలు శిక్ష అనుభవించడం లాంటివి  జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గర్భధారణ తో ఉన్నప్పటికీ మహిళలు జైలు శిక్ష అనుభవిస్తూ కుమిలిపోతూ ఉంటారు . సాధారణంగా ఒక మహిళ  ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె తిరిగే ప్రదేశాలు వినే మాటలు.. అంతేకాకుండా ఆస్వాదించే క్షణాలే అటు  రాబోయే రోజుల్లో పుట్టబోయే బిడ్డ ఎలా మారాలి అన్న నిర్ణయిస్తాయి  అని చెబుతూ ఉంటారు నిపుణులు .  అయితే గర్భిణీ మహిళలు జైలులో శిక్ష అనుభవిస్తూ ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డ సమాజం ద్వేషించే విధంగా ఉంటాడు అని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించింది.



 ఇటీవలి కాలంలో హైకోర్టులు కీలక తీర్పు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒక కీలక విషయంలో సంచలన  తీర్పు ఇచ్చింది హైకోర్టు.  డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఒక గర్భిణీకి బెయిలు మంజూరు చేసింది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. అంతేకాదు గౌరవప్రదమైన మాతృత్వం  ప్రతి స్త్రీ యొక్క హక్కు అంటూ స్పష్టం చేస్తోంది. గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు బెయిల్ అంటూ వ్యాఖ్యానించింది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు. గతంలో డ్రగ్స్ కేసులో నిందితురాలిగా అరెస్టయింది మహిళ. ఈ క్రమంలోనే గర్భిణీగా ఉన్నప్పుడు ఈ జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చింది. అయితే  ఇటీవలే గర్భంతో ఉన్న మహిళ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


 ప్రతి స్త్రీ కూడా సమాజంలో గౌరవప్రదమైన మాతృత్వానికి అర్హురాలు  అంటూ తెలిపిన హైకోర్టు గర్భం దాల్చిన మహిళకు తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలని సూచించింది. ప్రసవం   జరిగిన తర్వాత మళ్లీ ఆ మహిళ యొక్క శిక్షణ పొడిగించవచ్చు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఒక వేళ శిక్షను అనుభవిస్తున్న గర్భవతి జైలులోనే ప్రసవిస్తే అభం శుభం తెలియని ఆ పుట్టబోయే బిడ్డ ఎన్నో నిందలు మోయాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు. చివరికి సామాజిక ద్వేషాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది. సమాజం మొత్తం జై లో పుట్టిన బిడ్డ అంటూ ద్వేషిస్తూ ఉంటే ఇక ఆ చిన్నారి పోకడలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు అంటూ తెలిపింది. జైలులో  మంచి ఆహారం అందించడం వల్ల ఆరోగ్యం బాగానే ఉండొచ్చేమో కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: