ఇటీవలి కాలంలో ఎన్నో రకాల అక్రమాలు పెరిగిపోయాయి. కొంతమంది అక్రమంగా మాదకద్రవ్యాలను రవాణా చేస్తుంటే మరి కొంతమంది అక్రమ మద్యం రవాణా చేస్తున్నారు. కొంతమంది మరి కొన్ని రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక ఇటీవల ఏపీలో ఇలాంటి కార్యక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎంతోమంది వానపాముల అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు.  ఈ క్రమంలోనే ఇక పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏదైనా వాహనం కాస్త అనుమానాస్పదంగా కనిపించింది అంటే వెంటనే తనిఖీ చేసి అన్ని వివరాలను సేకరిస్తున్నారు.




 ఇక ఇటీవలే నెల్లూరు జిల్లాలోని ఒక టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. అయితే ఇక తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి కార్ డ్రైవర్ లో కంగారు మొదలైంది. దీంతో డ్రైవర్ కంగారు పడటాన్ని  గమనించిన పోలీసులు ఆ కార్ తనిఖీ చేసి చూడగా ఒక్కసారిగా షాకయ్యారు. కావలి జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది  అక్కడ పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ఒక కార్ అనుమానాస్పదంగా కనిపించింది.



 ఈ క్రమంలోనే వెంటనే ఆ కారును ఆపి సోదాలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులు ఏకంగా అక్రమంగా రవాణా చేస్తున్న 80 కేజీల వానపాములను పట్టుకున్నారు. ప్రస్తుతం కారు లో ఉన్న ఈ వానపాముల విలువ సుమారు రెండున్నర లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వానపాములను కార్ డ్రైవర్ పోలీసులకు అప్పజెప్పారు. రొయ్యల హచరీష్ కు ఈ వానపాములను తరలిస్తున్నట్లు డ్రైవర్ అంగీకరించాడు. అయితే ఈ వానపాములను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక ఇంత భారీ మొత్తంలో వానపాములను అసలు ఎక్కడినుంచి తీసుకువచ్చారు అన్న విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: