ప్రతి అమ్మాయి కూడా తాను పెళ్లి చేసుకోబోయే వాడు గురించి ఎన్నో కలలు కంటూ ఉంటుంది. ఒక రాకుమారుడు తన కోసం ఆకాశం నుంచి ఎగురుకుంటూ వచ్చి ఇక తనను పెళ్లి చేసుకుంటాడని.. ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. అంతేకాదు తనకు కాబోయే వరుడు విషయంలో కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక తనకు ఇష్టమైన వాడితో పెళ్లి జరిగిన తర్వాత ఎంతో ఆనందంగా కొత్త జీవితంలోకి అడుగు పెడుతుంది. అయితే చిన్నప్పటినుంచి పెంచిన తల్లిదండ్రులను వదిలేస్తున్నాను అని బాధ పడినప్పటికీ ఇక మెట్టినింట అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా అని ఆనంద పడుతూ ఉంటుంది యువతి.



 అయితే పెళ్లి జరిగిన తర్వాత ఉండే ఆనందం లో అటు శారీరక సుఖం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.కానీ పెళ్లి తర్వాత అలాంటి శారీరక పొందలేని అన్న విషయం ఆ యువతికి తెలిస్తే..  ఇక ఏకంగా కట్టుకున్న భర్త అసలు మగాడే కాదు అన్న విషయం బయటపడితే ఆ యువతి పరిస్థితి ఎలా ఉంటుంది. బయటకు చెప్పుకోలేక లోపల బాధ పడలేక కుమిలిపోతూ ఉంటుంది. ఇక్కడ ఓ యువతికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని  పెళ్లి చేసుకుంది ఆ యువతి. ఇక ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి జరిగింది. ఈ క్రమంలోనే వారికి మూడు రాత్రులు జరగాల్సి ఉంది.



 కానీ భర్త మాత్రం భార్యను దూరం పెడుతూ వచ్చాడు..  ఎందుకు అలా దూరం పెడుతున్నాడు అన్న విషయం మాత్రం భార్యకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఓ రోజు భర్త ఫోన్ చెక్ చేయగా సంచలన  విషయం బయటపడింది. తాను పెళ్లి చేసుకున్న యువకుడు అసలు మగాడు కాదని గే అన్న విషయం బయటపడింది.. ఏకంగా గే యాప్ లలో అతని ప్రొఫైల్స్ దర్శనమిచ్చాయి. దీంతో అవాక్కయిన ఆ యువతికి తన జీవితం నాశనం అయి పోయింది అంటే బెంగళూరులోని బసవన్న గుడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  అన్నీ తెలిసి తన జీవితాన్ని నాశనం భర్త కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది యువతి.

మరింత సమాచారం తెలుసుకోండి: