కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ వైపు అడుగులు వేసింది. ఈ నెల 31నుంచి ఆగస్ట్ 1వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధించింది. వారంతపు లాక్ డౌన్ తో కేసులు తగ్గుతాయని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేరళలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ కారణంగా కేంద్రం కూడా అప్రమత్తమైంది. వైద్య నిపుణులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేరళకు పంపిస్తోంది.

ఇక భారత్ లో కొత్తగా 43వేల 509మంది కరోనా బారిన పడ్డారు. మరో 640మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 15లక్షల 28వేల 114కు చేరింది. ఇప్పటి వరకు 4లక్షల 22వేల 662మంది కరోనాతో మరణించారు. కొత్తగా 38వేల 465మది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీల సంఖ్య 3కోట్ల 7క్షల వెయ్యి 612కు చేరింది ప్రస్తుతం దేశంలో 4లక్షల 3వేల 840యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని 2021 జనగణన కార్యక్రమాన్ని తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు.. నిరవధికంగా వాయిదా వేసినట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో ఈ గణన ఉండబోతుందన్నారు. ప్రజలు సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించేలా మొబైల్ యాప్, సెన్సస్ పోర్టల్ అభివృద్ధి చేశామన్నారు.


దేశవ్యాప్తంగా కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరి వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గాంధీతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేరే వారి సంఖ్య  క్రమంగా పెరుగుతోంది. ప్రజలు నిర్లక్ష్యం వ్యవహరి్సతూ కోవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఏ మాత్రం అజాగ్రత్త వహించినా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. జాగ్రత్తలు తప్పక పాటిద్దాం.. కోవిడ్ కు దూరం ఉందాం.




మరింత సమాచారం తెలుసుకోండి: