ఈటెల గెలుపు బీజేపీలో కొంద‌రికి న‌చ్చ‌దు. కిష‌న్ కు న‌చ్చినా భాగ్య‌న‌గ‌రి నేత‌ల‌కో, క‌రీంన‌గ‌ర్ నేత‌ల‌కో న‌చ్చ‌దు. అలా అని కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌దిలి  ఈటెల కోసం కిష‌న్ ఇటుగా రాలేరు. ఆయ‌న‌ను ఓడించేది టీఆర్ఎస్ కాదు బీజేపీనే అన్న‌ది సుస్ప‌ష్టం అవు తున్న వార్త..ఓ విధంగా చెప్పాలంటే బీజేపీలో గులాబీ దండు పాతుకుపోయింద‌ని,వారే కేసీఆర్ ఏజెంట్లుగా ప‌నిచేసి, ఈటెలకు దె బ్బ‌కొట్ట‌నున్నారు అని తెలుస్తోంది. వీరి కార‌ణంగా ఈటెల‌కు ఈ సారి ఈ ఎన్నిక ఏమీ కలిసొచ్చేలా లేద‌ని తెలుస్తోంది. డ‌బ్బు పో యినా ప‌ర్వాలేదు కానీ ప‌రువు పోతే ఈటెల లాంటి సున్నిత మ‌న‌స్కులు బీజేపీ లాంటి పార్టీల‌లో ఇమ‌డ‌లేరు అని కూడా కొందరు వ్యాఖ్యాని స్తున్నారు. త‌న‌వారే త‌న‌కు వెన్నుపోటు పొడిచి ఆ రోజు త‌న‌ను టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు పంపేశార‌ని,ఇక్క‌డ కూడా అలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంద‌ని ఈటెల బాధ‌ప‌డుతున్నార‌ని కొంద‌రు అంటున్నారు.

ఏదేమైన‌ప్ప‌టికీ టీఆర్ఎస్ ను వీడ‌కుండా ఉంటేనే మేలు అని, ఇప్పుడు ఇలా త‌న జీవితం మారుతుంద‌ని తాను అనుకోలేద‌ని ఈటెల భావిస్తున్నారు.ఓ విధంగా పోటీలో ఇంత‌టి విద్వేషాలు ఉంటాయ‌ని కూడా అనుకుని ఉం డ‌రు ఈటెల.ఆ రోజు టీఆర్ఎస్ నుంచి ఇటుగా వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌కు ద‌క్కిన గౌర‌వం ఈ రోజు ద‌క్క‌డం లేదు.జాతీయ పార్టీల‌లో లోక‌ల్ లీడ‌ర్స్ స్థానం పెద్ద‌గా ఉండ‌దు..అని..అక్క‌డ ఎవ్వ‌ర‌యినా ఒక్క టే అన్న విధంగా ఉం టుంద‌ని ప‌లువురు ఇప్ప‌టికే వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ కు ప‌ద వి వ‌రించాక ఆయ‌న పెంచిన దూకుడు ఓ విధంగా బండి పెంచ‌లేక‌పోతున్నారు. అలా అని కిష‌న్ స‌పోర్టు చేసిన ఈటెల‌కు సాయం చేయ‌లేక‌పోతున్నారు. ఓ విధంగా అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో కొంద‌రు బీజేపీ నాయ‌కులు ప‌నిచేస్తున్నార‌ని టాక్. వాస్త‌వానికి చా లా మంది బీజేపీ నాయ‌కులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా ఉన్నార‌ని, అదే ఈటెలకు మైన‌స్ కానుంద‌ని తెలుస్తోంది.


మొత్తానికి నేనెవ‌ర్ని అని ప్ర‌శ్నించుకుంటున్నారు ఈటెల‌. రెండో నంబర్ నాయ‌కుడిగా ఆ రోజు టీఆర్ఎస్ స‌ర్కార్లో జ‌య‌కేత‌నం ఎ గుర‌వేసిన ఆయ‌న ఇప్పుడు దిక్కులు లెక్క‌పెడుతున్నారు. బండి సంజ‌య్ కార‌ణంగా అ వ‌స్థ‌లు ప‌డుతున్నారు. పార్టీ అంతా త‌న దే అన్నంత గా బీజేపీ క‌థ‌ను న‌డిపిస్తున్న బండిని సైడ్ చేయాల‌ని కిష‌న్ రెడ్డి చూస్తున్నా అది సాధ్యం కావ‌డం లేదు. రాష్ట్ర  రాజకీయాల‌ను తీవ్ర స్థాయిలో ప్ర‌భావితం చేయ‌గ‌ల కిష‌న్ ఓ ఎంపీని అడ్డుకోలేక‌పోతున్నార‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఈటెల ఒ క్క‌డై పోరాడుతుంటే ఆయ‌న‌కు సంజ‌య్ ఇస్తున్న మ‌ద్ద‌తు అంతంత మాత్ర‌మే అన్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఆయ‌న గెలిచినా గెలవకున్నా తన ప‌ ద‌వికి ఢోకా లేద‌న్న కాన్ఫిడెన్సులో సంజ‌య్ ఎడం ఎడంగా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: