అందుకే కొద్ది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ లన్నిటికీ బ్రేక్ ఇచ్చి మళ్లీ పాలిటిక్స్ పై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. పార్టీ పై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రత్యర్థులు విమర్శలు విసిరేందుకు రెడీ అవుతారు. కానీ ఆ చాన్స్ ఎవరికీ ఇవ్వకుండా అటు సినిమాలను ఇటు పాలిటిక్స్ ను బ్యాలెన్స్ చేసి మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలి అనుకుంటున్నారట పవన్. కాగా పవర్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇప్పటికే రాజకీయ పరంగా ఒక ప్రముఖ పార్టీగా పేరు గాంచింది. ఇపుడు పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని అందుకుని పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కానీ ఇప్పటికే ప్రజల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భోగట్టా. మరి ఏదైనా ఒక సినిమా పూర్తి చేసిన తరువాత వెళ్లనున్నారా లేదా రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే వెళుతారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి