ఏపీ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా అంటే సూచనలు అలానే ఉన్నాయి అంటున్నారు ప్రముఖ ఆరోగ్య విశ్లేషకులు. ప్రధానంగా అమరావతిలో క్రమంగా కేసుల సంఖ్య పెరగడం ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తోంది. అందులోనూ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆందోళన కలుగుతోంది. దేశంలో కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ఇతర రాష్ట్రాలలో లాగానే ఆంధ్ర రాష్ట్రంలోని లాక్ డౌన్ సడలింపులు చేయడం జరిగింది. దాంతో అప్పటి వరకు ఎంతో కష్టంగా బంధీలుగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటకు రావడం యధా విధిగా స్వేచ్ఛగా తిరగడం వంటివి ప్రారంభించారు. అయితే ఇదే అదునుగా చేసుకుని తర్వాత మరోసారి విజృంభిస్తుందా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం అమరావతిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూ పోతోంది. జులై 20 వ తేదీ నుండి ప్రతి రోజూ సగటున 594 మంది కరోనా రోగులు హాస్పిటల్లో బెడ్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు . ఇక కరోనా నుండి కోలుకొని  హాస్పిటల్ నుండి  డిశ్ఛార్జి అవుతున్న వారి సంఖ్య దాదాపు  500 లుగా ఉంటోంది.  వైరస్ వ్యాప్తిలో మూడవ దశ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్న నేపథ్యంలో ఇలా ఒక్క సారిగా రాష్ట్రంలో కేసులు పెరగడం భయాందోళనలు కలిగిస్తోంది. వైజాగ్ లో వచ్చినటువంటి వేరియంట్ల మార్పు కారణం గానే ఈ వైరస్ వ్యాప్తి వేగం పుంజుకుందని నిపుణుల అంచనా.

హాస్పిటల్ లో  ఉన్న వారిలో 47.3% మంది ఆక్సిజన్‌ వార్డుల్లో ఉండగా, 15.6% మంది ఐసీయూలో ఉన్నట్లు సమాచారం. అలాగే 4.77% మంది  వెంటిలేటర్లపై ఉన్నారు. ఇపుడు ఇలా అమరావతిలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడం తో రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై కలవరం మొదలయ్యింది. మరి దీనిపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: