దేశంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులకు వరుసగా షాకుల ఇస్తూ వచ్చింది. ఇక ఎక్కడికక్కడ ఉగ్రవాదులను మట్టుబెడుతూ వచ్చింది భారత ప్రభుత్వం. అయితే ఈ క్రమంలోనే ఇక రెండవ సారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో.. సరిగ్గా ఎన్నికలకు ముందు పుల్వామాలో ఉగ్రవాదుల ఎటాక్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా  సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్ నీ ఉగ్రవాది ఏకంగా వాహనంతో ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏకంగా 40 కి పైగా జవాన్లు వీర మరణం పొందారు. ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.



 అయితే ఈ ఘటన తర్వాత కేవలం భారత్ మాటలతోనే ఈ ఘటనను ఖండిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బాలకోట్ పై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఆర్మీ. ఈ క్రమంలోనే ఉగ్రవాద స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది.  దీంతో ఇక ఉగ్రవాదులు అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ అంతర్జాతీయ సరిహద్దులు దాటి దాడి చేయడం మంచి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.



 అయితే కేవలం బాలకోట్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి వదిలిపెట్టలేదు భారత ఆర్మీ.  పుల్వామా దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న అందరినీ మట్టుబెట్టడమే లక్ష్యంగా ఎన్నో వ్యూహాలను అమలు చేస్తూ వచ్చింది.  పుల్వామా దాడి సృష్టించి మారణహోమం సృష్టించిన ఘటన వెనుక ఏకంగా 19 మంది సూత్రధారులు ఉన్నారు అన్న విషయాన్ని భారత ఆర్మీ గుర్తించింది. ఇప్పటివరకు  తొమ్మిదిమందిని భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఇక ఇటీవలే మసూద్ అజార్ మేనల్లుడు  పుల్వామా దాడి కీలక సూత్రధారినీ కూడా ఎన్కౌంటర్లో చంపింది  భారత ఆర్మీ. ఇంకా పుల్వామా దాడి ప్రతీకారం తీర్చుకోవడానికి మరో తొమ్మిది మందిని మట్టు పెట్టేందుకు కూడా భారత ఆర్మీ ఇంకా ఎన్నో ఆపరేషన్స్ చేపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: